- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt: ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హ్యాపీ
by Gantepaka Srikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఐఆర్ విడుదల చేయడంపై ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి జీవన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలా కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతి విడుదల చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు మూల వేతనంపై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
Advertisement
Next Story