- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: వేసవి ప్రారంభానికి ముందే భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. గతేడాది జనవరి, ఫిబ్రవరి మాసాలతో పోలిస్తే రెండు డిస్కంల పరిధిలో రాష్ట్రం మొత్తం మీద కరెంటు వాడకం గణనీయంగా పెరిగింది. ఈసారి వేసవి వేడి ఫిబ్రవరి నుంచే ప్రారంభం కావడంతో విద్యుత్ వినియోగం ఎక్కువైనట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెలలో రికార్డు స్థాయిలో శుక్రవారం (ఫిబ్రవరి 23న) గరిష్ట స్థాయిలో 15,031 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని తెలిపారు. గతేడాది ఇది 14,649 మెగావాట్లు మాత్రమేనని వివరించారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో 6.9% మేర, ఫిబ్రవరిలో 4.6% మేర విద్యుత్ వినియోగం పెరిగినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందని, గత పదేండ్ల కాలంతో పోలిస్తే రికార్డు స్థాయిల నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వాడకం ఇలా..
గతేడాది ఫిబ్రవరిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,649 మెగావాట్లు నమోదుకాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 15,031 మెగావాట్లకు చేరుకుంది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వినియోగమైన విద్యుత్ సగటు 242.95 మిలియన్ యూనిట్ల చొప్పున ఉంటే ఈ ఏడాది అదే రెండు నెలల కాలానికి 256.74 మిలియన్ యూనిట్లకు చేరుకున్నది.
దక్షిణ డిస్కం పరిధిలో...
దక్షిణ డిస్కం పరిధిలో గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలకు 6.67%, ఫిబ్రవరి నెలకు 6.24% చొప్పన అధిక వినియోగం నమోదైంది. గతేడాది ఫిబ్రవరిలో గరిష్ట డిమాండ్ 9,043 మెగావాట్లు ఉండగా, ఈసారి ఫిబ్రవరి 23 నాటికి 9,253 మెగావాట్లకు పెరిగింది. ఈ నెలాఖరుకు మరింత పెరిగే అవకాశమున్నది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల సగటు విద్యుత్ వినియోగం 158.71 మిలియన్ యూనిట్ల చొప్పున నమోదుకాగా ఈసారి ఆ రెండు నెలలకు 169.36 మిలియన్ యూనిట్లకు చేరుకున్నది.
హైదరాబాద్ సిటీలో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరి నెలలో 9.47% శాతం, ఫిబ్రవరి నెలలో 12.27% చొప్పున అధిక వినియోగం నమోదైంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో గరిష్టంగా విద్యుత్ డిమాండ్ 2,930 మెగావాట్లు నమోదైతే ఈసారి ఫిబ్రవరి 23 నాటికి 3,174 మెగావాట్లు అయింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటు విద్యుత్ వినియోగం 51.69 మిలియన్ యూనిట్లు ఉండగా ఈసారి అది 57.34 మిలియన్ యూనిట్లకు చేరుకున్నది. ఒక్క ఫిబ్రవరి నెలను పరిగణనలోకి తీసుకుంటే 65 మిలియన్ యూనిట్లయింది.