MLC Notification: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్

by Prasad Jukanti |
MLC Notification: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ను (MLC Election Notification) కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదల చేసింది. ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీ కాలం ఈ నెల 29తో ముగియనున్నది. ఈ ఐదుగురి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు (Nominations Start). 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 20 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గటంల వరకు పోలింగ్ అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నది.

అభ్యర్థులపై కసరత్తు

ప్రస్తుతం శాసనసభలో పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి అధికార కాంగ్రెస్‌ (Congress) పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు, బీఆర్‌ఎస్‌కు (BRS) ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. దీంతో టికెట్ కోసం రెండు పార్టీల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయం కానున్న నేపథ్యంలో టికెట్ దక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. మరో వైపు తమకున్న సంఖ్యా బలం రీత్యా ఒక అభ్యర్థిని గెలిపిం చుకోగల బీఆర్ఎస్ పార్టీ రెండో అభ్యర్థిని సైతం బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed