- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. అధికార పార్టీ నుంచి పోటీలో ఉండేది ఎవరు..?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం ఈ నెల 29న పూర్తి అవుతుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ పొందనున్నారు. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీకి చెందినవే కావడంతో పోటీ ఏర్పడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కుల సమీకరణలు, ఆర్థిక సమీకరణలతో పాటు పార్టీకి ఏమేరకు అవసరం అవుతారనే విషయాలను పరిగణలోని తీసుకొని ఆ దిశగా అధినేత కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో కుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పార్టీల మనుగడ వాటిపైనే ఆధారపడి ఉంది.
అవకాశం దక్కేదెవరికి..?
రాష్ట్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బలం 104 మంది ఉన్నారు. ఎంఐఎం-7, కాంగ్రెస్ -5, బీజేపీ-3 సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే అధికార పార్టీకి తప్ప ఇతరులు పోటీ చేసి విజయం సాధించే అవకాశం లేదు. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు సైతం అధికార పార్టీకి చెందినవే కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారు, ఇతర పార్టీల నుంచి వచ్చి హామీ పొందిన వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రధానంగా బూడిద భిక్షమయ్యగౌడ్, చల్లా వెంకట్రాంరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌ను మరోసారి రెన్యూవల్ చేస్తారని విశ్వసనీయ సమాచారం. అరికల నర్సారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో పాటు చకిలం అనిల్ కుమార్, చాడ కిషన్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వేముల వీరేశం, మోత్కుపల్లి నరసింహులు, కర్నె ప్రభాకర్, తేరా చిన్నప్పరెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, వేనేపల్లి చందర్ రావు, జూపల్లి కృష్ణారావు, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ ఇలా పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. వీరికి తోడు పారిశ్రామిక వేత్తలు సైతం తెరమీదకు వస్తుండటంతో టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి :
బిగ్ న్యూస్: బయ్యారంపై ‘‘పాలిటిక్స్’’.. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు BRS నయా ప్లాన్..!