- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. మనీలాండరింగ్ హవాలా చట్టం కింద శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కవిత అరెస్ట్ సమాచారాన్ని ఆమె భర్తకు తెలిపినట్లు ఈడీ పేర్కొంది. కవిత అరెస్ట్‌కు సంబంధించిన 14 పేజీల మెమో వివరాలను కవిత భర్త అనిల్‌కు అందించామని తెలిపారు.
కాగా, ఇవాళ మధ్యాహ్నం నుండి హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. అరెస్ట్ వారెంట్ జారీ చేసి సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్ట్ పోర్టుకు తరలించి.. అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి నేరుగా కవితను ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లనున్న అధికారులు.. ఇవాళ రాత్రి ఆమెను అక్కడే ఉంచనున్నారు. రేపు (శనివారం) కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించి.. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Kavitha Arrest : ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ తరలిస్తున్న ఈడీ అధికారులు