‘దిశ’ సక్సెస్‌కు కారణం అదే.. క్యాలెండర్‌ ఆవిష్కరణలో ఎడిటర్ మార్కండేయ (వీడియో)

by GSrikanth |   ( Updated:2024-01-01 16:51:00.0  )
‘దిశ’ సక్సెస్‌కు కారణం అదే.. క్యాలెండర్‌ ఆవిష్కరణలో ఎడిటర్ మార్కండేయ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సరం సందర్భంగా ‘దిశ’ దినపత్రిక క్యాలెండర్‌ను ఎడిటర్ డి. మార్కండేయ ఆవిష్కరించారు. సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని సంస్థ కార్యాలయంలో స్టాఫ్‌తో కలిసి 2024కు సంబంధించిన క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు. అనంతరం నూతన సంవత్సరం నేపథ్యంలో కేక్ కట్ చేశారు. ఉద్యోగులంతా కేక్‌ తినిపించుకొని ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎడిటర్ మార్కండేయ మాట్లాడుతూ.. తెలుగు మీడియా రంగంలో దిశ మరిన్ని సంచలనాలు సృష్టించబోతోందని చెప్పారు. వినూత్న ప్రయత్నాలతో ఇప్పటివరకు మీడియా రంగంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశామని.. ఆ ఒరవడిని కొనసాగిస్తూనే మరిన్ని సాహసాలు చేయబోతున్నామని అన్నారు.


Advertisement

Next Story

Most Viewed