- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బంధు పథకంలో అవకతవకలపై ఈడీ విచారణ చేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో: ఒక్కో ఎమ్మేల్యే ఒక్కో లబ్దిదారుడి నుంచి 3 లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా దళితబంధు పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రకటించారు. తక్షణమే ఈ పథకంలోని అవకతవకలపై ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేయాలని దళిత ఇండస్ట్రీయల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఒక్కో అసెంబ్లీలో 1500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 70 లోన్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్ చెప్పినట్టు ఒక్క లోను లబ్దిదారుడి నుంచి రూ. 3 లక్షలు కమిషన్ తీసుకంటే ఒక్క ఎమ్మేల్యే రూ. 45 కోట్ల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు.
ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంలో రూ. 5000 కోట్ల పైగా కమిషన్లు రూపంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇదంతా దళితుల డబ్బేనని కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) సుమోటా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బును మొత్తం రికవరీ చేసి లబ్దిదారులకు ఇవ్వాలని, అలాగే దోషులుగా తేలిన ఎమ్మేల్యెలపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టాలని ఆలాగే ఎన్నికలలో పోటీచేయకుండా జీవిత కాలం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.