- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ కేసులో కవితపై ఈడీ మరిన్ని సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో బుధవారం కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. మనీలాండరింగ్ కేసులో అనేక మంది నిందితులకు బెయిల్ రాలేదని తెలిపింది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయని స్పష్టం చేసింది. ఈ కేసులో తప్పు జరిగినట్లుగా సుప్రీంకోర్టు నిర్ధారించిందని పేర్కొంది. మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీవాల్‌ను కలిశారని తెలిపింది.
కవితను కలవమని కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెప్పారని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ ఆదేశాలతో కవితను శ్రీనివాసులు రెడ్డి కవితను హైదరాబాద్‌లో కలిశారని తెలిపింది. కేజ్రీవాల్ రూ.100 కోట్లు అడిగారని కవిత శ్రీనివాసులు రెడ్డికి చెప్పారని పేర్కొంది. రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత శ్రీనివాసులు రెడ్డిని కోరారని తెలిపింది. అభిషేక్, బుచ్చిబుకు రాఘవ రూ.25 కోట్లు ఇచ్చారని.. ముడుపుల ద్వారా కవిత ఇండో స్పిరిట్స్ లో భాగస్వామ్యం పొందారని కోర్టుకు తెలిపింది. వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పనిచేసినట్లు ఆరోపించింది. దీనికి సంబంధించి బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ చాట్స్‌లో ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.
కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని తెలిపింది. అప్రూవర్లను అనుమానించడం కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడమే అని ఈడీ స్పష్టం చేసింది. కవితకు నోటీసులిచ్చాకే పిళ్లై స్టేట్ మెంట్ వెనక్కి తీసుకున్నారని.. కవిత ఒత్తిడితోనే అరుణ్ పిళ్లై వెనకడుగు వేశాడని పేర్కొంది. కవిత తన ఫోన్లలో సమాచారం డిలీట్ చేశారని.. కవిత ఇచ్చిన 10 ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చినట్లు తెలిపింది. సమాచారం తొలిగించడంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని తెలిపింది. కవిత సాక్ష్యాలు ధ్వంసం చేశారని.. సాక్షులను బెదిరించారని పేర్కొంది.