- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేనల్లుడి వ్యాపార వివరాలు కవిత చెప్పడం లేదు.. ఈడీ తరపు లాయర్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. కవితకు మరో ఐదు రోజుల కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరగా.. తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది కోర్టులో కీలక వాదనలు వినిపించారు. సోదాల సమయంలోనే కవిత ఫోన్‌ను సీజ్ చేశామని చెప్పారు. మొబైల్‌లో కొంత డేటా సమాచారం డిలీట్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. కవిత ఫోన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించామని అన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌తో సరిపోల్చి చూసినట్లు వెల్లడించారు. అంతేకాదు.. కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు కూడా చెప్పాలని కోరామని.. కానీ, తనకు తెలియదని కవిత సమాధాని ఇచ్చినట్లు ఈడీ తరపు న్యయవాది కోర్టుకు వివరించారు. కవిత మేనల్లుడి పాత్ర విషయంలో నిజాలు తేల్చేందుకు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.