సీఎం రేవంత్ పాలనలో రూ. 25 వేల కోట్లు అప్పు మాత్రమే.. కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
సీఎం రేవంత్ పాలనలో రూ. 25 వేల కోట్లు అప్పు మాత్రమే.. కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెచ్చిన అప్పు రూ.25 వేల కోట్లు మాత్రమేనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈమేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గత పదేళ్లలో చేసిన అప్పు అక్షరాలా రూ. 7,00,000 కోట్లు అని వెల్లడించింది. కేసీఆర్ చేసిన ఈ పాపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తోందని విమర్శించింది.

గడిచిన ఆరు నెలల కాలంలో ప్రభుత్వం తిరిగి చెల్లించిన అప్పు, వడ్డీ కలిపి అక్షరాలా రూ.38000 కోట్లు అని పేర్కొంది. అంటే నికరంగా రూ. 13,000 కోట్ల (38,000 - 25,000 = 13,000) అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ప్రభుత్వమే రూ.13,000 కోట్లు నికరంగా అప్పులు తిరిగి చెల్లిస్తే.. ఇంకా అప్పు చేసింది ఎక్కడ? అని పేర్కొంది. కాగా, అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోందని తెలుస్తోంది. పాత బాకీలు కడుతున్నదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed