డీఎస్పీలు ఫోన్ చేసి ప్రాణ గండం అని భయపెట్టారు.. KTR సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-16 09:41:54.0  )
డీఎస్పీలు ఫోన్ చేసి ప్రాణ గండం అని భయపెట్టారు.. KTR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపులు, నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనపై మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తాను చెప్పను అని కానీ వాళ్లు ఇబ్బంది పడతారని.. వారికి నియోజకవర్గంలోని డీఎస్పీలు ఫోన్ చేసి మీరు పార్టీ మారండి లేదంటే ప్రాణ గండం ఉందని భయపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా పోలీసు అధికారులు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేశారని కేటీఆర్ ఆరోపించారు.

Next Story