- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: తెలంగాణ సెక్రటేరియట్‌పై డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Telangana Secretariat)పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు (Drone Flew Over Secretariat) సెక్రటేరియట్ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ ఎగరేసిన ఇద్దరినీ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వంశీ, నాగరాజు అనే ఇద్దరినీ సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు సమాచారం. వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story