Sajjanar : లైఫ్ తో 'గేమ్స్' వద్దు గురు ! : సజ్జనార్ వార్నింగ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-28 05:14:58.0  )
Sajjanar : లైఫ్ తో గేమ్స్ వద్దు గురు ! : సజ్జనార్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ క్రైమ్...ఆన్ లైన్ మోసా(Online Fraud)లపై ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరించే టీజీ ఆర్టీసీ ఎండీ, సీనీయర్ ఐపీఎస్ అధికారి వీ.సీ.సజ్జనార్(Sajjanar)మరోసారి ఎక్స్ వేదికగా ఆన్ లైన్ గేమ్స్(Online Games) పై ప్రజలకు అప్రమత్తం చేశారు. జీవితంతో 'గేమ్స్' అసలే వద్దంటూ(Don't Play Games' With Life) సందేశం ఇచ్చారు. సరదా కోసం ఆన్ లైన్ పెయిడ్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టి.. తెలియకుండానే వాటికి వ్యసనపరులై డబ్బు కోసం నేరాల బాట పడుతూ ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.

బీటెక్ చదివిన ఓ యువకుడు ఆన్ లైన్ గేమ్స్ లో డబ్బు పెట్టడం కోసం దొంగగా మారిన ఉదంతాన్ని ప్రస్తావించారు. మహాబూబాబాద్ జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంకు చెందిన బీటెక్ ఇంజనీర్ పిట్టల సాయి ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడి గేమ్స్ లో పెట్టేందుకు డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలనుకున్నాడు. కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలోని గాయత్రి జ్యువెలర్ షాపుకు వెళ్లిన సాయి బంగారు గొలుసు కొంటానని చెప్పగా.. షాపు యజమాని గొలుసు చూపించాడు. 1లక్ష 20వేల విలువైన తులంన్నర బంగారు గొలుసును మెడలో వేసుకుని పారిపోయాడు.

బాధిత షాపు యజమాని కేకలతో స్థానికులు వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. జ్యువెలరీ షాపు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను ప్రస్తావించిన సజ్జనార్ యువకులు ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.



Next Story

Most Viewed