అధైర్య పడొద్దు. అండగా ఉంటా.. : హరీష్ రావు

by Anjali |
అధైర్య పడొద్దు. అండగా ఉంటా.. : హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: అన్నదాతలు అధైర్య పడద్దని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో నాంచార్ పల్లి, పొన్నాల, ఎన్ సాన్ పల్లి, తడకపల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్, ఇర్కోడు, తోర్నాల తదితర గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి చేనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మొదటి దశలో పరిశీలించిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఎకరాకు పదివేల నష్టపరిహారం అందించనునటట్లు ప్రకటించారన్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు, వేల కోట్లు వెచ్చించి నాణ్యమైన విద్యుత్ అందించినప్పటికీ ప్రకృతి వైపరీత్యంతో పంటలు దెబ్బ తినడం దురదృష్టకరమన్నారు.

సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకే 35000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, మంగళవారం కురిసిన వరగండ్ల వానకు దెబ్బతిన్న పంట వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కోదాడ సూర్యాపేట తదితర జిల్లాల్లో మాదిరి డిసెంబర్ నెలాఖరిలోపే వరి నాట్లు పూర్తయ్యే విధంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దీంతో వడగండ్ల వాన బారిన పంటలు పడే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సుధా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed