- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇప్పటికైనా అర్థమైందా రేవంత్ రెడ్డి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర పోస్ట్

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికైనా గురుకులాల విలువ అర్థమైందా రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) అన్నారు. రేవంత్ రెడ్డి పర్యటన (Revanth Reddy Tour)లో ఓ బాలిక చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో (Video) ను ట్విట్టర్ (Twitter) వేదికగా పోస్ట్ (Post) చేసిన ఆయన.. ఈ వీడియోను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు. దీనిపై ఆయన.. అర్థమైందా రేవంత్ రెడ్డి, గురుకులాల (Gurukulas) వల్ల ఎందరి జీవితాలు మారతాయో? మీరు మా మీద ఫేక్ కేసుల (Fake Cases) కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు అవే పైసలను ఈ పేద పిల్లల మీద పెట్టండి, కొంచెం పుణ్యం అయినా దక్కుతుందని సూచనలు చేశారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిదిగా నారాయణపేట జిల్లా (Narayana Peta District) అప్పకపల్లి (Appaka pally)లో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ (Petrol Bunk)ను మంత్రులు (Ministers), ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు. అంతేగాక నారాయణ పేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. అలాగే డాక్టర్ చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ బాలిక తనకు డాక్టర్ కావడం ఒక కళ అని, తాను గురుకుల పాఠశాలలో చదువుతూ డాక్టర్ కాగలనా అనే అనుమానం ఉండేదని, కానీ గురుకుల పాఠశాల (Gurukula School)లో చదివి కూడా డాక్టర్ కావచ్చని ఇప్పుడు అనిపిస్తుందని చెప్పింది. అంతేగాక తన గ్రామంలో మొట్టమొదటిగా డాక్టర్ (Doctor) చదువుతున్న వ్యక్తిని కూడా తానేనని సీఎం (CM)తో గర్వంగా చెప్పింది. ఈ వీడియోను ఆర్ఎస్పీ (RSP) సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేశారు.