DK Aruna: బీజేపీ చొరవతోనే ఎస్సీల 30 ఏళ్ల కర నెరవేసింది

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-01 10:09:13.0  )
DK Aruna: బీజేపీ చొరవతోనే ఎస్సీల 30 ఏళ్ల కర నెరవేసింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ చొరవతోనే ఎస్సీల 30 ఏళ్ల కర నెరవేసిందని తెలిపారు. ఎట్టకేలకు ఎమ్మార్పీఎస్ పోరాటం ఫలించిందని అన్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణపై ఇవాళ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి గురయ్యారు.



Next Story

Most Viewed