- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాష్ట్రంలో కవిత ఒక్కతే మహిళా: డీకే అరుణ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఆత్మగౌరవం అంటే కల్వకుంట్ల కవిత ఒక్కరేనా రాష్ట్రంలో ఆమె ఒక్క మహిళనే ఉన్నారా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం స్పందించిన డీకే అరుణ్ కవిత స్పెషల్ కాదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తున్నారని అందులో భాగంగానే కవితకు నోటీసులు వచ్చి ఉంటాయన్నారు. విచారణ పూర్తయ్యాక విషయం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందన్నారు.
బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను ఖుషీ చేయడానికి మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని నోటీసులు ఇస్తూ కక్ష్య సాధిస్తోందన్న బీఆర్ఎస్ విమర్శలను ఖండించారు. ఇందులో కక్ష్య సాధింపు చర్యలు ఏమీ లేదని అన్నారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీనే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కాగా తనకు ఈడీ నోటీసులు రావడంపై స్పందించిన కవిత.. తెలంగాణ తల వంచదని ట్వీట్ చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదు అన్నారు.