- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ
దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్పంపిణీ చేయాలని సర్కార్ప్లాన్ చేసింది. 21 రోజుల దశాబ్ది వేడుక షెడ్యూల్ క్యాలెండర్‌లో ఆరోగ్యశాఖకు కేటాయించిన రోజున ఈ కిట్లను రాష్ట్రమంతటా పంపిణీ చేయనున్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు అధికారులకు ఆదేశాలిచ్చారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ న్యూట్రిషన్కిట్ల ద్వారా 2023-24లో రాష్ట్ర వ్యాప్తంగా 6.84 లక్షల మహిళలు లబ్ధి పొందుతారన్నారు. 14-26 వారాల సమయంలో (రెండో ఏఎన్‌సీ), 27-34 వారాల సమయంలో (మూడో ఏఎన్‌సీ) సమయంలో రెండుసార్లు కిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 24 జిల్లాలో 111 కేంద్రాల్లో కిట్ల పంపిణీ ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.కిట్లు పొందేందుకు వచ్చే గర్భిణులు ఇబ్బంది పడకుండా ఉండేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.
ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్లు ఒక అద్భుత పథకం అని, దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గిందన్నారు. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామని, ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకానికి రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. నాలుగు ఏఎన్‌సీ చెకప్స్, కేసీఆర్ కిట్లు, అమ్మఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు దోహదం చేస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.
రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం ఇప్పటికే న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లో మొత్తం1.25 లక్షల మంది గర్బిణులకు రెండు ఏఎన్‌సీల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుండటంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా (మిగతా 24 జిల్లాల్లోనూ) కిట్స్ పంపిణీ నీ వైద్యారోగ్య శాఖ ప్రారంభించనుందన్నారు.ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యమని పేర్కొన్నారు. ఒక్కో కిట్ విలువ రెండు వేల రూపాయలు కాగా, దాదాపురూ. 277 కొట్లను ప్రభుత్వం అంచనా వేసిందన్నారు.
మరోవైపు 80 పని దినాల్లో కోటిన్నర మందికి కంటి వెలుగు చేరడం గొప్ప విషయమని మంత్రి కొనియాడారు.ఇప్పటి వరకు రీడింగ్ గ్లాసెస్ 21.46 లక్షల మందికి, 13 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రాథమిక వైద్యాన్ని పటిష్టం చేయడంలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన పల్లె, బస్తి దవాఖానలు వెంటనే ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇప్పటికే మంజూరు అయిన సబ్ సెంటర్ల నిర్మాణాలు, మరమ్మతు పనులు వేగవంతం చేయాలన్నారు. దూరంగా కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇవి ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, ఇతర విభాగాల హెచ్‌వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.