- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే నెల తెలంగాణ అసెంబ్లీ రద్దు.. MP కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
దిశ, డైనమిక్ బ్యూరో: మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ డిజాల్వ్ అవ్వబోతున్నదని.. దీనికి సంబంధించి కేంద్ర పెద్దలతో కేటీఆర్ ద్వారా కేసీఆర్ అంతా మాట్లాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుండి తమకు సోర్స్ ఉందన్నారు. శుక్రవారం ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించి కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తెలంగాణకు ఎక్కువ సమయం ఇచ్చే ఛాన్స్ లేకుండా జూలైలో అసెంబ్లీని రద్దు చేయబోతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలతో ముందే మాట్లాడుకున్నారని.. మంత్రి కేటీఆర్ అమిత్ షాతో భేటీ కాలేదని పేపర్లలో వచ్చినప్పటికీ నిజానికి ముందే అమిత్ షాతో కేటీఆర్ భేటీ అయ్యారన్నారు. తమకు కూడా ఢిల్లీలో అంతో ఇంతో పరిచయాలు ఉంటాయని.. అసెంబ్లీ రద్దు విషయంలోనూ తమకు సమాచారం ఉందన్నారు.
మంత్రి కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ అని ఆయనకు జాతీయ పార్టీ సిద్ధాంతాల గురించి తెలియదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరూ అని ప్రశ్నించిన కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో నలుగురు ఐదుగురు సీఎం క్యాండిటేట్లు ఉన్నారన్నారు. వచ్చే నెల 2వ తేదీన ఖమ్మంలో జరగబోయే సభతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరిస్తామన్నారు. మరో మూడు నెలలు కాంగ్రెస్ శ్రేణలు కష్టపడితే సాధించిన తెలంగాణను బాగుచేసుకుందామన్నారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయాలని కోరారు.
Also Read..
తెలంగాణ బీజేపీ చీఫ్ ఓ బిత్తిరి సత్తి: బండి సంజయ్‌పై రేవంత్ రెడ్డి సెటైర్లు