సవాళ్లు వచ్చినపుడే సమర్థత బయట పడుతుంది : డీజీపీ అంజనీకుమార్

by Sumithra |
సవాళ్లు వచ్చినపుడే సమర్థత బయట పడుతుంది : డీజీపీ అంజనీకుమార్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : సవాళ్లు ఎదురైనపుడే సమర్థత బయట పడుతుందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. తెలంగాణ గ్రే హౌండ్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ విభాగాలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విధుల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, ఇతర పతకాలు సాధించిన 38మంది పోలీస్ అధికారులను గురువారం తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గ్రే హౌండ్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీల పనితీరును వేర్వేరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు అధ్యయనం చేసి తమ తమ సిబ్బందికి శిక్షణ కూడా ఇప్పించుకున్నారని చెప్పారు.

ఈ మూడు విభాగాలే కాకుండా మొత్తం పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణలో అంకితభావాన్ని కనబరిస్తే శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా కాపాడవచ్చని అన్నారు. మన అధికారులు సాధించిన మెడల్స్ చూస్తేనే తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరు ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోనే ఇది సాధ్యం అయ్యిందన్నారు. పతకాలు సాధించిన అధికారులను అభినందించటం ఇదే మొదటిసారి అని గ్రే హౌండ్స్ అదనపు డీజీ విజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సందీప్ శాండిల్య, షిఖా గోయల్, అభిలాష బిస్త్, స్వాతీ లక్రా, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్ ప్రభాకర్ రావు, షా నవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డి, తరుణ్ జోషి, అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed