- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం వినతి
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెస్ట్ ఇన్ హోటల్ లో జరుగుతున్న బొగ్గు గనుల వేలంలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే బొగ్గు గనులు వేలం పాటలో ఉండటం బాధాకరం అని..ఈ నిర్ణయంతో సింగరేణి ఈ ప్రాంతంలో తన హక్కులు కోల్పోయిందన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసని.. సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి కానీ.. తెలంగాణలోని 4 గనుల బ్లాకులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించడం బాధాకరం అని భట్టి అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల 2 సార్లు వేలంలో సింగరేణి పాల్గొనలేదు. కేంద్ర ఇప్పుడు మరో బ్లాకును వేలానికి పెట్టింది. ఇలా చేయడం వల్ల సింగరేణి లాంటి సంస్థను కుదేలు చేయడమే అన్నారు. అనంతరం శ్రావణ పల్లి బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.