- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhatti Vikramarka: సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికనే కానీ.. రుణమాఫీ సభలో భట్టి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లాలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ సంబురం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశానికి సంబంధించిన ఒక అధ్భుతమైన రోజు అని, పరాయి పాలనలో భాద పడుతున్న ఈ భారతదేశానికి.. ఈ జాతీని విముక్తిని కలిగించి స్వాతంత్ర్యం అందించిన కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని వివరించారు. ఈ రోజు రెండు అతి ముఖ్యమైన కార్యక్రమాలు రాష్ట్రంలో జరిగాయన్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ధైర్యం ఎవరూ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని చాలెంజ్ విసిరి.. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్న చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదన్నారు. అందుకే ఈ రోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు అని హర్షం వ్యక్తంచేశారు. రూ. 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడమనేది సాధ్యం కాదని అందరూ అనుకున్నారు.. నేను కూడా అనుకున్నాను.. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చాలెంజ్ విసిరి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పంతో రుణమాఫీ చేశారన్నారు. పదేళ్లలో 2014 నుంచి 2018 వరకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్న నాటి సీఎం కేసీఆర్.. ఆ లక్ష రూపాయలు చేయలేక పోయారన్నారు.
నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తే.. ఆ డబ్బులు వడ్డికే సరిపోయయన్నారు. అసలు అలాగే మిగిలిందన్నారు. 2018 నుంచి 2023 వరకు లక్ష చేస్తానని చెప్పిన ఆ పెద్దమనిషి.. ఐదేళ్లు చేయలేక చివరిగా ఎన్నికల ముందు అరకొరగా చేసి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. పదేళ్లలో కేవలం లక్ష రూపాయలు చేయని ఆనాటి ప్రభుత్వం ఎక్కడ.. కేవలం 15 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చాలెంజ్ చేసి చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడ అని ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులు బాగుండాలని కేవలం రుణమాఫీ కాదు.. ఈ దేశ చరిత్రలో ఎవరూ వ్యవసాయ శాఖకు కేటాయించినటు వంటి నిధులు రూ.72 వేల కోట్లు బడ్జెట్‌లో తమ ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. సీఎం సభలో మాట్లాడి ఆదేశాలిచ్చినా మరు క్షణం నుంచే రూ.2 లక్షల వరకు రుణమాఫీ డబ్బులు ఆ అకౌంట్లలోకి మారిపోతయని స్పష్టంచేశారు. ఈ రోజు ఆగస్టు 15.. కాబట్టి రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడుతాయన్నారు.
బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ సహా ఇతర మాజీ మంత్రులు సీతారామ ప్రాజెక్టు మా మానస పుత్రిక అని మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. నిజమే సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికనే.. కానీ గతంలో దివంగత సీఎం వైఎస్ఆర్ ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారన్నారు. ఆ ప్రాజెక్టులే రూపాంతరం చెంది.. సీతారామ ప్రాజెక్టుగా మారిందని వివరించారు. కానీ వాళ్లు మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావుతో ప్రాజెక్టులపై చర్చించడానికి సిద్దమేనని సవాల్ చేశారు. మీ మానస పుత్రిక అవినీతి మయం.. మా ప్రాజెక్టులు ప్రజలకు నీళ్లు అందించేవని విమర్శించారు.