Deputy Cm Bhatti: మల్టీ లెవెల్ కంపెనీలు వస్తున్నాయి.. ఆ సమస్య రాకుండా చూడండి

by Gantepaka Srikanth |
Deputy Cm Bhatti: మల్టీ లెవెల్ కంపెనీలు వస్తున్నాయి.. ఆ సమస్య రాకుండా చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్: టీజీఎస్పీడీసీఎల్‌పై డిప్యూటీ సీం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు ఒరిగే అవకాశం ఉందని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగర్ దేశానికే తలమానికం అని తెలిపారు. హైదరాబాద్‌కు అనేక మల్టీలెవెల్ కంపెనీలు వస్తున్నాయని అన్నారు. ఆ కంపెనీలకు విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని ఆదేశించారు. కాగా, గ్రేటర్‌ వ్యాప్తంగా విద్యుత్‌ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని కార్పొరేట్‌ కార్యాలయంలో గ్రేటర్‌లోని కేబుల్‌ ఆపరేటర్స్‌, ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడింగ్‌ సంస్థల ప్రతినిధులు, కేబుల్‌ టీవీ అసోసియేషన్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Advertisement

Next Story