- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణలో పదేళ్లు విధ్వంసం’.. బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన డిప్యూటీ CM భట్టి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మోడల్‌ను దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి మనందరం నడుం బిగించి పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసి విజయం సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకంగా నిలవనుందని స్పష్టం చేశార. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ బహిరంగ సభ నుంచే సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. తాడీత, పీడిత బడుగు బలహీన వర్గాల బాగు కోసం ఒక విప్లవకారుడిగా రాహుల్ గాంధీ ఈ సభలో న్యాయ్ పత్రం ఆవిష్కరించారన్నారు. గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ వ్యవస్థను సంక్షోభం సృష్టించి సుడిగుండంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకంపై శ్వేత పత్రం విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెట్టామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్టాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిందని ఆరోపించారు.
లక్షల కోట్ల రుపాయల అప్పులనుండి ఈ రాష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి రాష్ట్రంలో 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2.80 ఫించన్ దారులకు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రకటించిన 6 గ్యారెంటీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని, జీరో బిల్లుతో 50 లక్షల మందికి ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధిగమించి రాహుల్ గాంధీ పర్యవేక్షణలో చేస్తున్న దశ దిశ ప్రకారం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ మొదలు పెట్టామన్నారు.