Minister Konda Surekha Vs Nagarjuna : మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం కేసు వాయిదా

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-30 06:31:18.0  )
Minister Konda Surekha Vs Nagarjuna : మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం కేసు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున(Hero Nagarjuna) వేసిన పరువు నష్టం దావా(Defamation case) కేసు విచారణ నవంబర్ 13కు వాయిదా పడింది. నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో కేసు విచారణను ఇంచార్జి న్యాయమూర్తి నవంబర్ 13కు వాయిదా వేశారు. కొండా సురేఖ తరఫున ఆమె న్యాయవాది గురుమిత్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. హీరో నాగార్జున వేసిన పిటిషన్ పై ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లకు ఈ రోజు కోర్టులో మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యాల్సిఉంది. ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్ల స్టేట్మెంట్ లను న్యాయస్థానం రికార్డు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో కొండా సురేఖ నాగార్జున కుటుంబంపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే అక్కినేని నాగార్జున పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి కొండా సురేఖపైన నాగార్జున 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

అటు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్లను రికార్డ్ చేయాల్సిఉంది. నిరాధారమైన కొండా సురేఖ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. గత విచారణలో కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు.

Advertisement

Next Story