- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటి దగ్గర నుంచే ఓటు ఎలా వెయ్యొచ్చంటే?
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో ఫస్ట్ టైం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని ఈసీ తీసుకొచ్చింది. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఈసీ ఈ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. 80 ఏళ్లు పైబడిన వారు.. దివ్యాంగులకు మాత్రమే ఈ అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయని ఎవరికీ అపోహలు వద్దని ఈసీ తెలిపింది.
ఇంటి నుంచే ఓటు ఇలా..
80 ఏళ్ల పైబడిన వారు.. దివ్యాంగులు పోలింగ్ కు ఐదు రోజుల ముందే ఫారం12D కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం బృందాలు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా..? కాదా..? అనేది సరి చూస్తారు. అర్హులు అని క్లారిటీకి వచ్చిన తర్వాత ఫారం 12D తీసుకుని ఎన్నికల సిబ్బంది వారి ఇంటికే వెళ్తారు. బ్యాలెట్ పేపర్ వారికి ఇచ్చి ఓటు వేయిస్తారు. ఓటు వేసే సమయంలో పక్కన ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు. ఓటు ఎవరికి వేశారనే విషయంలో మాత్రం గోప్యత ఉంటుంది.
పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. పోలింగ్ బూత్ లో ఎలాంటి ప్రక్రియ అయితే జరుగుతుందో.. అదే తరహాలో ఇంట్లో వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలుంటుంది. కర్ణాటకలో 80 ఏళ్లకు పైబడిన వారు 12లక్షల 15 వేల మంది ఉన్నారు. 5లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఈసీ తాజా నిర్ణయంతో వీరంతా ఇక ఇళ్లలో నుంచే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఎంత మంది అప్లై చేసుకున్నారు. ఎంత మందికి ఓటు హక్కు కల్పించామనే విషయాలను ఎన్నికల సిబ్బంది ఆయా రాజకీయ పార్టీలతో పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాచారం ఇస్తుంది. రానున్న రోజుల్లో ఈ కొత్త పద్ధతికి ఏ మేరకు రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.