- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాయ్‌లాండ్‌లో చీకోటితో పాటు ‘చిట్టి’ అరెస్ట్.. బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!
దిశ, సంగారెడ్డి బ్యూరో: థాయిలాండ్ దేశంలోని పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ క్యాసినో డాన్ చీకోటి ప్రవీన్ కుమార్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అరెస్ట్ కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. 2022 జూలైలో చికోటి ప్రవీణ్‌పై ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే చీకోటితో దేవేందర్ రెడ్డికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. అప్పుడే దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ చేపడుతుందని భావించగా.. ఈ వ్యవహారం ఎందుకు సద్దుమనిగిందని తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఇప్పుడు థాయిలాండ్ గ్యాంబ్లింగ్‌లో ప్రవీణ్ కుమార్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. చికోటికి దేవేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు బినామీలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. గతంలోనే చికోటి వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర సంచనలం సృష్టించగా దాదాపు 9 నెలల తరువాత ఇప్పుడు ఏకంగా అరెస్ట్ కావడం అధికార బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారితీసింది. చికోటితో చిట్టి దేవేందర్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో విహరించడం, ఓపెన్ టాప్ జీపులో పలు విందు కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్సులు చేయడం వంటి వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకకు చెందిన ఆయన రెండోసారి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుతో పాటు పార్టీలోని ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయి. దేవేందర్ రెడ్డి సతీమణి ప్రస్తుతం సదురి కొండపాక సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. గతంలో కొండపాక జెడ్పీటీసీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, గజ్వేల్, తూప్రాన్ ప్రాంతాలకు చెందిన ప్రముఖులతో చికోటికి మంచి సంబందాలున్నాయి. పలు సందర్బాల్లో చికోటి ఏడుపాయల దుర్గాభవాని ఆలయానికి బస్సుల్లో ప్రముఖులతో కలిసి వచ్చారు. తూప్రాన్, గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. చికోటి ఎక్కడ కనిపించినా అక్కడ చిట్టి దేవేందర్ రెడ్డి ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఊహించని విదంగా థాయిలాండ్ లో దేవెందర్ రెడ్డి అరెస్ట్ కావడం ఇప్పుడు చర్చకు దారితీస్తున్నది.
పదవికి ఎసరు వస్తుందా..?
గ్యాంబ్లింగ్‌లో చిట్టి దేవేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో వివిధ రకాల చర్చలు వినిపిస్తున్నాయి. బాధ్యతగల పదవిలో ఉండి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ పట్టబడిన నేపథ్యంలో పదవికే ఎసరు వస్తుందా..? అనే చర్చ జరుగుతున్నది. ఇతర దేశాల్లో చట్టాలు ఎలా ఉంటాయి..? ఇక్కడ ఏ విధంగా వ్యవహరించరున్నారో వేచి చూడాల్సి ఉన్నదని ఓ అధికారి చెప్పు కొచ్చారు. ఏదీ ఏమైన చిట్టి దేవేందర్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.