మూడు నోటిఫికేష‌న్ల రాత ప‌రీక్షల తేదీలు ఖరారు

by sudharani |
మూడు నోటిఫికేష‌న్ల రాత ప‌రీక్షల తేదీలు ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) మూడు ఉద్యోగ నోటిఫికేషన్లకు రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 185 వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టులను, 22 హార్టికల్చర్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను, 113 అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న విషయం తెలిసిందే.

ఈ నెల 15, 16 తేదీల్లో వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ (క్లాస్- ఏ అండ్ బీ) పోస్టులకు, ఏప్రిల్ 4న హార్టిక‌ల్చర్ ఆఫీస‌ర్, ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భ‌ర్తీకి రాత ప‌రీక్షలు నిర్వహించ‌నున్నట్లు పేర్కొంది. ఈ మూడు నోటిఫికేష‌న్ల రాత‌ప‌రీక్షల‌న్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించ‌నున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. అయితే ఈ పరీక్షల హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ తేదీలను మాత్రం బోర్డు ప్రకటించలేదు.

Advertisement

Next Story