Danam Nagender: పాడి కౌశిక్‌రెడ్డి ఒక పిల్లబచ్చా

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-12 12:05:34.0  )
Danam Nagender: పాడి కౌశిక్‌రెడ్డి ఒక పిల్లబచ్చా
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాడి కౌశిక్‌రెడ్డి ఒక పిల్లబచ్చా అని కామెంట్ చేశారు. కౌశిక్‌రెడ్డి.. తన స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. నేను కూడా హైదరాబాద్‌ వాడినే.. ఒక్క పిలుపుతో బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లను బ్లాక్ చేయగలమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమలోంచి బీఆర్‌ఎస్‌ బయటకు రావాలని దానం నాగేందర్ సూచించారు. గతంలో కాంగ్రెస్‌(Congress) ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌(BRS)లో చేర్చుకోలేదా? అని దానం నాగేందర్ ప్రశ్నించారు.

కాగా, ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీఏసీ చైర్మన్‌గా ప్రకటించినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి విమర్శల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(Arekapudi Gandhi) మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం కౌశిక్‌ రెడ్డి ఇంటిపై కొందరు కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు దానం నాగేందర్ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.






Next Story

Most Viewed