Danam Nagender: కేటీఆర్‌కు నేను క్లీన్‌ చిట్ ఇవ్వలే.. ఎమ్మెల్యే దానం హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-01-12 07:35:14.0  )
Danam Nagender: కేటీఆర్‌కు నేను క్లీన్‌ చిట్ ఇవ్వలే.. ఎమ్మెల్యే దానం హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)కు తానేమి క్లీన్ చిట్ (Clean Chit) ఇవ్వలేదని ఖైరతాబాద్ (Khairtabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ సోషల్ మీడియా (Social Media)లో జరుగుతోన్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్‌‌ (Hyderabad)లో ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా ఈ- రేసు (Formula E-Race) నిర్వహించడం మంచిదేనని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే అన్నానని క్లారిటీ ఇచ్చారు. ఫార్ములా ఈ-రేసుపై కేటీఆర్‌ తన సలహా తీసుకున్నారని.. అప్పుడే తన అభిప్రాయం చెప్పానని అన్నారు. అయితే, తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో ఏసీబీ (ACB), ఈడీ (ED) విచారణ కొనసాగుతోందని అన్నారు. అదేవిధంగా ఎన్నికల సయయంలోనే ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల మళ్లింపులో క్విడ్‌ప్రోకో (Quid Pro Quo) జరిగినట్లుగా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కేసు విచారణ తరువాత అన్ని వాస్తవాలు అవంతట అవే బయటకు వస్తాయని.. ఈ విషయంలో కేటీఆర్‌కు తాను క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు. తాను ఒక ఫైటర్‌‌నని.. ఉప‌ఎన్నిక వచ్చినా భయపడేది లేదన్నారు. ‘హైడ్రా’పై తన వ్యా్ఖ్యల్లో ఏమాత్రం మార్పు లేదని.. ఆ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలన్నా్రు. మూసీపై పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు ఒక్క రోజు నిద్ర చేశారని.. వాళ్లకు నిద్రకు ముందే అక్కడికి ఏసీలు వెళ్లాయని ఎద్దేవా చేశారు. నిర్వాసితుల ఇళ్లలో కాకుండా బయట నుంచి తెచ్చిన అల్పాహారాన్ని కిషన్‌రెడ్డి తిన్నారని.. కంటి తుడుపుగా బీజేపీ నేతలు మూసీ నిద్ర చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు.

Next Story