సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్‌ను వదలని సైబర్ కేటుగాళ్లు.. మళ్లీ అదే వరుస

by Prasad Jukanti |
సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్‌ను వదలని సైబర్ కేటుగాళ్లు.. మళ్లీ అదే వరుస
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రూపాల్లో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా ఏసీబీ డీజీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీపీ ఆనంద్ ను సైతం సైబర్ నేరగాళ్లు వదల్లేదు. ఫేస్ బుక్ లో ఆయన పేరుతో ఫేక్ ఐడీని క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సీవీ ఆనందే తెలియజేస్తూ నెటిజన్లను అప్రమత్తం చేశారు. ఎవరో సైబర్ మోసగాడు మళ్లీ నా నకిలీ ఫేస్ బుక్ ఐడీని సృష్టించి డబ్బులు పంపించాలని అడుగుతున్నాడు. దయచేసి స్పందించ వద్దని సూచించారు. ఎక్స్ లో ఓ యూజర్ హ్యాపీ బర్త్ డే సర్ అంటూ చేసిన పోస్టుకు రియాక్ట్ అవుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తన బర్త్ డే జూన్ 5న అని చెబుతూ తన పేరుతో నకిలీ ఖాతా క్రియేట్ అయిన విషయాన్ని నెటిజన్లకు సీవీ ఆనంద్ తెలియజేశారు. గతంలోనీ సీవీ ఆనంద్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. కాగా ఫేక్ అకౌంట్లను గుర్తింస్తే వెంటనే రిపోర్ట్ కొట్టాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story