- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CS Shanti Kumari: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు.. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో గోదావరి నది తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు వర్ష సూచనలు ఉండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే.. వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెరువులు, కుంటలు తెగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుకొవాలన్నారు. భారీగా వరదలు సంభవిస్తున్న క్రమంలో భద్రాద్రి, ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపుతో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎస్ శాంతికుమారి దిశా నిర్దేశం చేశారు.