- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. అడిషనల్ ఎస్పీ భుజంగరావు అరెస్టు
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో:మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో తాజాగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావును దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం విచారణకు పిలిచిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో భుజంగరావు పని చేశారని ఆ సమయంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న కలిసి ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణారావు, ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం వీరిద్దరు విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
Next Story