గవర్నర్ వ్యవస్థపై CPM నేత తమ్మినేని కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-06-30 12:28:05.0  )
గవర్నర్ వ్యవస్థపై CPM నేత తమ్మినేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ వ్యవస్థపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రసుత్త సమయంలో దేశంలో గవర్నర్‌ వ్యవస్థ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థ బ్రిటిష్‌ కాలం నాటిదని తెలిపారు. బీజేపీ పాలనలో గవర్నర్లు రాజకీయ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. తమిళనాడులో మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. మంత్రిని తొలగించే అధికారం సీఎంకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

తమిళనాడు గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ గవర్నర్ కూడా యూనివర్సిటీ బిల్లును ఆపి విద్యార్థులకు నష్టం చేస్తుందని ఆరోపించారు. మణిపూర్‌లో రాజకీయ లబ్ధికోసం బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాగా, బీఆర్ఎస్ సర్కార్ vs గవర్నర్ తమిళిసైగా నడుస్తోన్న వైరంలో సీపీఎం నేతలు తలదూర్చడం పొత్తుకు సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే పొత్తుకు సిద్ధంగా ఉన్నామని, సీట్ల లెక్క తేల్చండని వామపక్షాలు సీఎం అపాయింట్మెంట్ కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారి అపాయింట్మెంట్‌ను సీఎం పెండింగ్‌లో పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed