- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BV Raghavulu: ఆ పార్టీలకు కమ్యూనిస్టు పార్టీకి చాలా తేడా ఉంది

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిస్టుల(Communist Party)ను పాలకులు సహించడం లేదని సీపీఐఎం పొలిట్‌బ్యూరో(CPIM Polit Bureau) సభ్యులు బీవీ రాఘవులు(BV Raghavulu) అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డిలో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని మిగిలిన పార్టీలకు కమ్యూనిస్టు పార్టీలకు చాలా తేడా ఉందని అన్నారు. బూర్జువ పార్టీలు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తాయని విమర్శించారు. కానీ సీపీఐఎం పేదల కోసం, సామాన్యులు, రైతులు, కార్మికుల కోసం పని చేస్తుందని చెప్పారు. అవి సంపన్నుల పార్టీలు అని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగు పడాలంటే ఎర్రజెండాతోనే సాధ్యమని ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీ దున్నేవాడికే భూమి కావాలని డిమాండ్ చేస్తోందని అన్నారు. కానీ పాలకులు, ప్రభుత్వాలు అలా నడుచుకోవడం లేదని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.
కార్మికులకు హక్కులు ఉండవు. ఉద్యమాలు చేసే హక్కు ఉండదు. మోడీ(PM Modi)ని విమర్శిస్తే జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు, కష్ట జీవులకు హక్కులు కావాలని అభిప్రాయపడ్డారు. కులం, మతం పేరుతో ప్రజలను విభజిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం పన్నుల్లో 50 శాతంవ వాటా రాష్ట్రాలకు ఇవ్వాలని అన్నారు. రాజ్యాంగం లో వేతనం హక్కుగా కల్పించాలి. చట్ట ప్రకారం 60 ఏండ్లు దాటితే పెన్షన్ ఇవ్వాలి. ఇల్లు హక్కు కావాలి. విద్యా హక్కు కావాలి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి. ఉచిత వైద్యం అందించాలి. ఉచిత విద్య కావాలి అని ఎర్రజెండా పోరాటం చేస్తుందని అన్నారు.