ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలి: CPM

by GSrikanth |
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలి: CPM
X

దిశ, తెలంగాణ బ్యూరో: మవోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాతో పాటు, మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని మంగళవారం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బాంబే హైకోర్టు సాయిబాబాను గతంలోనే నిర్దోషిగా తేల్చినా, మహారాష్ట్ర పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. ఈ కేసును మరోసారి విచారించాలని బాంబే హైకోర్టుకు సూచించిందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడే బాంబే హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తక్షణమే వీరిని విడుదల చేయాలని ఆయన కోరారు.

Advertisement

Next Story