- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS వర్సెస్ CPI.. పొత్తును మరిచి తన్నుకున్న శ్రేణులు
దిశ, ఖమ్మం రూరల్ : రాష్ట్రంలో ఓ వైపు టీఆర్ఎస్, సీపీఐ పొత్తులు పెట్టుకుంటుండగా.. మరోవైపు పాలేరు నియోజకవర్గంలో ఆ రెండు పార్టీల నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు దాడులకు దిగుతూ రక్తం చిందించుకుంటున్నారు. తాజాగా కామంచికల్లులో ప్రారంభమైన గొడవ.. ఖమ్మం వరకు పాకి తలలు పగలకొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్, సీపీఐ శ్రేణులు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇంతకూ ఏం జరిగిందంటే...?
పాలేరు నియోజకవర్గం కామంచికల్లు గ్రామంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సమక్షంలో సీపీఐకి చెందిన సర్పంచ్మేదరమెట్ల వెంకటరమణ, వార్డుమెంబర్లు, సీపీఐ నాయకులు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సమయంలో జానబాద్తండాకు చెందిన సీపీఐ నాయకుడు మరణించగా ఆ పార్టీ నాయకుడు కమలాకర్ వచ్చి నివాళ్లర్పించి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన కామంచికల్లు గ్రామానికి వచ్చేసరికే టీఆర్‌ఎస్‌నాయకులు కమలాకర్వెళ్తున్న కారును అడ్డగించి ''ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. మా గ్రామంలో నీ పెత్తనం ఏంటి..?'' అని నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ నెలకొంది. వారిని తోసుకుని కమలాకర్ ఖమ్మం చేరుకున్నారు. ఈ విషయం కామంచికల్లు సీపీఐ నాయకులతో పాటు కమలాకర్ స్వగ్రామమైన గుడురుపాడుకు చెందిన పార్టీ నాయకులకు తెలియడంతో పెద్ద ఎత్తున కామంచికల్లు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరికి, సీపీఐకి చెందిన ఐదుగురి తలలకు గాయాలైనట్లు తెలిసింది. దీంతో ఇరుపక్షాలకు చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
రాష్ట్రంలో అలా.. పాలేరు ఇలా..!
ఏదిఏమైనా గురువారం ఓవైపు పాలేరు నియోజకవర్గ సీపీఐ సమావేశం జరగడం.. అందులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అవాకులు చావకులు పేలడం.. సాయంత్రమే సీపీఐ సర్పంచ్‌తో పాటు ఇతర నాయకులు టీఆర్ఎస్‌లో చేరడం ఈ గొడవకు దారితీసిందని తెలుస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులు–టీఆర్ఎస్పొత్తులు ఉంటాయని అధిష్టానం చెబుతున్నా పాలేరులో మాత్రం అలాంటి వాతావరణం కనిపించడంలేదు. రూరల్‌లో ఇటీవల సీఐ తీరు పై సీపీఐ నాయకులు సీపీకి, ఎమ్మెల్యేకు విన్నవించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కూనంనేని.. బహిరంగంగానే మాట తప్పిన ఎమ్మెల్యే కందాల అని విమర్శించిన విషయం విధితమే.