- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CPI Kunamneni: సంతాప సభలో ఏలేటికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని చురకలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప సభ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సంతాప సభలో మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్ళాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏలేటికి ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చురకలు అంటించారు. సభలో (CPI MLA Kunamneni Sambasiva Rao) ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదని కూనంనేని అన్నారు.
సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పారు. నివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పుకొచ్చారు. నివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలని సూచించారు. కేటీఆర్ లాగా చక్కగా శాసన సభ సంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పించాలి కానీ రాజకీయాలకు దీన్ని వేదిక చేయకూడదన్నారు. దేశగతి, గమనాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మార్చారని, నిజాయితీ, నిబద్దతకు నిలువుటద్దం మన్మోహన్‌సింగ్ అని కూనంనేని కొనియాడారు. కాగా, అంతకుముందు శాసనసభలో బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి వ్యాఖ్యల వల్ల స్వల్ప గందరగోళం ఏర్పడింది. ఏలేటీ స్పీచ్‌ను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నారు.