- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ నేతలు కలవడానికి కారణం ఇదే

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. సచివాలయంలో సుమారు గంట పాటు జరిగిన భేటీలో వర్తమాన అంశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామన్న హామీ గూర్చి సీఎంతో ప్రస్తావించగా, తాను ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. గడీల పాలన నుండి ప్రజలు విముక్తి కల్గించిన విదంగా ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా తమ సమస్యలు తెలుసుకునేందుకు , గేట్లు బద్దలు కొట్టడం , అలాగే ప్రజలందరూ కలుసుకునేందుకు చేసిన కృషి ఒక మంచి పరిణామమని సీఎంకు వారు తెలిపారు . గతంలో వున్నా ఐపీఎస్ అధికారులను మార్చడం ద్వారా అవినీతి లేని పాలనను అందించేందుకు అవకాశం ఉంటుందని , ఆ దిశగా మార్పులు చోటుచేసుకోవడాన్ని ఆహ్వానించదగ్గ విషయమని సిపిఐ నేతలు సీఎంకు తెలిపారు . ప్రజా పాలన కార్యక్రమాన్ని కొనసాగించాలని సీఎంకు వారు సూచించారు
న్యాయవిచారణ పరిధిలో సింగరేణిని చేర్చాలి..
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం తో పాటు, పటిష్ట పరచాలని సిఎంకు సిపిఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఇటీవల విద్యుత్ రంగంలో అక్రమాలపై న్యాయ విచారణ జరిపేందుకు శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, సింగరేణి కాలరీస్ జరిగిన అక్రమాలు, అవినీతిలను కూడా న్యాయ విచారణ పరిధిలోకి తీసుకురావాలని కూనంనేని సాంబశివరావు కోరారు. అలాగే సమ్మె నోటీసు ఇచ్చిన జెన్ కో కార్మికులు, ఇతర ఉద్యోగులపై గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, సుమారు 400 మంది ఫోర్ మెన్ ఆర్డిజన్ వివిధ కారణాలతో పని చేసిన చోటు బయటికి పంపడమో, తొలగించడమో, ఎస్ ఈ లను డిఈ లుగా, డి ఈ, ఎడిఈ లుగా డిమోట్ చేయడం వంటి చర్యలకు పాల్పడిందని తెలిపారు. వీటిని సరి చేయాలని సిఎంను కోరారు. సింగరేణి, జెన్ ట్రాన్స్ కో సంస్థలకు సమర్థులైన అధికారులను నియమించాలని కోరారు. ఈ అంశాలను విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాల్సిందిగా సీఎం సూచించారు.
అందరికీ అందుబాటులో ఉంటాం: సీఎం రేవంత్ రెడ్డి
కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉన్నట్లుగా ప్రజలలో భావన నెలకొన్నదని, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అందుబాటులో ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నదని సిపిఐ నేతలు ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా తాను ఎం ఎల్ ఏ లు, ప్రజా సంఘాలు, పార్టీలకు సమస్యలపై ప్రాతినిధ్యం చేసేందుకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటానని సీఎం చెప్పినట్లు సిపిఐ నేతలు వెల్లడించారు. డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని సీఎం కు సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం వివిధ సంస్థలు, శాఖలలో రిటైర్డ్ అధికారులను నియమించి ఏళ్ళ తరబడి కొనసాగించారని, కొత్త ప్రభుత్వంలో ఆ సంప్రదాయానికి స్వస్తి పలకాలని నారాయణ సూచించారు.
లోక్ సభ ఎన్నికల్లో పొత్తు..
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ అవగాహన సత్ఫలితాలను ఇచ్చిందని సిఎంతో సిపిఐ నేతలు పేర్కొన్నారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇండియాలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ , సిపిఐ లు తెలంగాణలో అవగాహనతో పోటీ చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేందుకు ముఖ్యమంత్రిని మరోసారి కలిసేందుకు నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా మీడియాతో కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. సీఎం ను కలిసిన వారిలో సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డిలతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, టి.శ్రీనివాస రావు, ఎన్. బాలమల్లేశ్,బాల నర్సింహా, బాగం హేమంతరావు, కలవేన శంకర్, టి. నరసింహాలు ఉన్నారు.