CPGET : రేపు సీపీగెట్-2022 ఫ‌లితాలు విడుదల

by Vinod kumar |
CPGET : రేపు సీపీగెట్-2022 ఫ‌లితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన‌ సీపీగెట్ 2022 ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు సీపీగెట్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగా రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి చేతుల మీదుగా మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయని చెప్పారు. ఆగస్టు 11 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 67,027 మంది దరఖాస్తు చేసుకోగా 57,262 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు.



Next Story

Most Viewed