సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు తీర్పు కాపీ రిలీజ్.. CS నెక్ట్స్ స్టెప్ ఏంటీ..?

by Satheesh |   ( Updated:2023-01-10 13:46:43.0  )
సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు తీర్పు కాపీ రిలీజ్.. CS నెక్ట్స్ స్టెప్ ఏంటీ..?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లాలని సూచిస్తూ ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు తీర్పు కాపీని విడుదల చేసింది. సోమేష్ కుమార్ తెలంగాణ క్యాడర్‌లో కొనసాగేలా 2016 మార్చిలో కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సోమేష్ కుమార్ వ్యవహరంలో క్యాట్ తన పరిధి దాటి వ్యవహరించిదని ధర్మాసనం జడ్జిమెంట్ కాపీలో పేర్కొంది. బ్యూరోక్రాట్లను నియమించే అర్హత కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉందని.. ఈ విషయంలో క్యాట్‌కు ఎలాంటి అర్హత లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రత్యూష సిన్హా కమిటీకి బ్యూరోక్రాట్లు కట్టుబడి ఉండాలని తీర్పు కాపీలో హైకోర్టు వెల్లడించింది. అయితే, క్యాట్ ఉత్తర్వులను కొట్టేసి.. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వెలువరించగా.. ఈ తీర్పు అమలుకు మూడు వారాల సమయం కావాలన్న సోమేష్ కుమార్ తరుఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. జడ్జిమెంట్ కాపీ రాగానే సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీ విడుదల కావడంతో.. సీఎస్ సోమేష్ కుమార్ నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తారా.. లేక సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్తారా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ కేడర్ నుండి సోమేష్ కుమార్ ఔట్

Advertisement

Next Story

Most Viewed