ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నం... పోలీసుల అరెస్టులు

by GSrikanth |   ( Updated:2023-01-09 14:03:55.0  )
ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నం... పోలీసుల అరెస్టులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో పోలీస్‌ రిక్ర్యూట్‌మెంట్‌ బోర్డు అవక తవకల వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులకు లాంగ్‌ జంప్‌ ఈవెంట్స్‌ కొలతలు పెంచడంతో వేలాది మంది ఉద్యోగ అర్హతలు కోల్పోతున్నారని డీవైఎఫ్ఐ నేతలు ఆరోపించారు. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Next Story

Most Viewed