రామగుండంలో కాంగ్రెస్ విజయం పక్కా: టీపీసీసీ చీఫ్ Revanth Reddy

by Satheesh |   ( Updated:2023-11-11 10:12:43.0  )
రామగుండంలో కాంగ్రెస్ విజయం పక్కా: టీపీసీసీ చీఫ్ Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: రామగుండం గల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురుతోందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండంలో కాంగ్రెస్ విజయం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. శనివారం రామగుండంలో కాంగ్రెస్ తలపెట్టిన విజయభేరి సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి సింగరేణి కార్మికులు తెలంగాణ కోసం కొట్లాడారు.. అప్పటి ప్రభుత్వాలు బెదిరించిన వారు బెదరకుండా ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.

కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక సింగరేణి కార్మికుల కలలు నేరవేరాయా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల కష్టాలు తీరుస్తున్నానని హామీ ఇచ్చారు, మరీ కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఓపెన్ కాస్ట్ గనులను మూయిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. సింగరేణి కార్మిక సంస్థ ఎన్నికలు ఎందుకు పెట్టలేదన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు క్రమబద్దీకరించలేదని ప్రశ్నించారు. బందిపోటు దొంగల్లా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed