తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు PCC చీఫ్ కీలక టాస్క్

by Gantepaka Srikanth |
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు PCC చీఫ్ కీలక టాస్క్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో తొలిసారిగా కులగణన సర్వేను సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ కార్యకర్తల కృషితో పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం చిత్త శుద్ధితో పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచన, ఆశయం మేరకు కులగణను సర్వే నిర్వహణ జరిగిందని అన్నారు.

40 ఏళ్ల కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ(Congress Party)కే దక్కుతుందని తెలిపారు. పీసీసీ కార్యవర్గం(PCC Executive Committee)తో పాటు ఇతర పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. కులగణన సర్వే(Caste Census Survey)ను శాస్ర్తీయబద్ధంగా ప్రభుత్వం నిర్వహించింది. కుల సర్వేపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

‘కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు తండ్రి మీద కొడుకు వలె అలక బూనిన మాట వాస్తవం.. వారందరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’ అని మహేష్ కుమార్ గౌడ్ భరోసా ఇచ్చారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణనను గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మీద ఉందని సూచించారు.

Next Story

Most Viewed