- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. ఉత్తర తెలంగాణ నుంచి స్టార్ట్ ?
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల పేర్లను ఢిల్లీ అధినేతల ముందు ప్రతిపాదించారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ మాత్రం నిజామాబాద్‌కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పాటు పార్టీలోని పలువురు కీలక నేతల అభిప్రాయాలను పార్టీ సేకరించనున్నది. ప్రియాంక, రాహుల్ గాంధీ రానుండటంతో తమ జిల్లా నుంచి మొదలు పెట్టాలని నేతల మధ్య పోటీ పెరగడం గమనార్హం. ఈ నెల 10న గాంధీభవన్‌లో నిర్వహించే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఈ యాత్రపై సమీక్ష జరగనున్నది. నేతలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నెల 15వ తేదీన బస్సు యాత్రతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నది.
అక్కడి నుంచే ఎందుకంటే..?
ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని నేతలు భావిస్తున్నారు. గతంలో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమావేశాలు జరిగాయి. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాల్లోనూ పార్టీ అగ్రనేతలతో బహిరంగ సమావేశాలు నిర్వహించారు. పార్టీ కేడర్‌లో జోష్రావడమే కాకుండా.. ఈ జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు వస్తాయని ఆ పార్టీ ఇంటర్నల్ సర్వేల్లోనూ తేలింది. కానీ వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో బలోపేతం కాలేదనేది పార్టీ వర్గాల్లో చర్చ. సునీల్ కొనుగోలు పలు దఫాలుగా నిర్వహించిన సర్వేల్లోనూ ఇదే తేటతెల్లమైంది. దీంతో బస్సు యాత్రను ఉత్తర తెలంగాణ నుంచే మొదలు పెట్టాలని ఎక్కువ మంది నేతలు కోరుతున్నారు. పైగా కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీలో ఉంటారని ఆ పార్టీ గతంలో ప్రకటించింది. దీంతో ప్రియాంక రాకతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల్లో భరోసా నింపవచ్చని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
పకడ్బందీగా ప్లాన్..
బస్సు యాత్రను సక్సెస్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు లక్ష్యం పెట్టుకున్నారు. ఈ నెల 15, 16న ప్రియాంక గాంధీ, 18, 19న రాహుల్ గాంధీ, 20 తర్వాత మల్లికార్జున ఖర్గే ఈ యాత్రతో పాటు కొన్ని చోట్ల జరిగే సమావేశాల్లో వేర్వేరుగా పాల్గొననున్నారు. దీంతో రూట్ మ్యాప్ రెడీ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. యాత్రను ఏ ప్రదేశం నుంచి మొదలు పెట్టాలి? జన సమీకరణ ఎలా చేయాలి? సెక్యూరిటీ అంశాలను పరిగణలోకి తీసుకొని యాత్రను కొనసాగించడం వంటి అంశాలపై పార్టీ ఈ నెల 10న జరిగే మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనున్నది.