- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత పార్టీ నేతలే నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు.. MP ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి భగ్గుమన్నాయి. ఆ పార్టీ వార్ రూం కేసు అంశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల యువజన కాంగ్రెస్ వార్ రూం కేసుపై స్పందించిన ఆయన.. వార్ రూమ్ ఇన్‌ఛార్జి ప్రశాంత్‌ను వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరో తేలాలని అన్నారు. సొంత పార్టీ నేతలపై వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం తన వరకే పరిమితం కాలేదని పలువురు కాంగ్రెస్ సీనియర్లపై కూడా ప్రశాంత్ పోస్టులు పెట్టాడని ఆరోపించారు. మా క్యారెక్టర్‌ను నాశనం చేసేలా వాట్సాప్ గ్రూపులతో సోషల్ మీడియాల్లో పోస్టింగులు పెట్టిస్తున్నారని దీని వెనుక కాంగ్రెస్ ముఖ్య నేతలే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఏ ఎల్లిగాడో, మల్లిగాడో, ప్రశాంతో పెట్టించిన పోస్టులు కావని ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక ఉన్నది ఎవరు, ఇదంతా ఎవరు చేయిస్తున్నారో రెండు రోజుల్లో అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు.
కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో ఇటీవల యూత్ కాంగ్రెస్ వార్ రూంలో పోలీసు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. వార్ రూం ఇన్‌ఛార్జిగా ఉన్న ప్రశాంత్‌ను పోలీసులు విచారణ కూడా చేశారు. పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు అనేలా గత కొంత కాలంగా పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ వెనుక ఉన్నది ఎవరనేదానిపై టీకాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయింది.
ఇవి కూడా చదవండి: