రూ. 500లకే గ్యాస్ సిలిండర్: MP కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-04-23 13:10:45.0  )
రూ. 500లకే గ్యాస్ సిలిండర్: MP కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. అధికారంలోకి రాగానే.. ఛత్తీస్ గఢ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. అంతేకాకుండా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయడంతో పాటు.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా తాను ఈ మాట ఇస్తున్నానని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ 25 కోట్ల వ్యవహారంపై తాను మాట్లాడేది ఏమి లేదని అన్నారు.

Advertisement

Next Story