- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యాదాద్రిలో భట్టికి అవమానం.. స్పందించిన కాంగ్రెస్ MLA

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కుర్చీలపై కూర్చోవడం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను కింద కూర్చోబెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిని బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో దళితులకు, బీసీలకు న్యాయం జరుగకపోగా.. అవమానాలు జరుగుతున్నాయని పోస్టులు పెడుతున్నారు.
తాజాగా.. ఈ ట్రోలింగ్‌పై ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పందించారు. కాంగ్రెస్‌పై కావాలనే ఒకవర్గం కుట్రపూరితంగా అసత్య ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. సమానంగా గౌరవం అందించామని తెలిపారు. వారికి కేటాయించిన సీట్లు హెచ్చుతగ్గుగా ఉండటం లోపంగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తున్న నాయకులు గమనించాలని సూచించారు. అందరినీ గౌరవించే ఆచారం యాదగిరిగుట్టకు ఉన్నదని చెప్పారు. ఇకనైనా ఈ ట్రోల్స్ ఆపాలని విజ్ఞప్తి చేశారు.