రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్‌ది: వీహెచ్

by GSrikanth |
రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్‌ది: వీహెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్‌దని మాజీ పీసీసీ చీఫ్​హనుమంతరావు పేర్కొన్నారు. ఖమ్మంలో రైతులు ధర్నా చేస్తే సంకెళ్లు వేయడం సరికదన్నారు. పైగా నాన్​బెయిలబుల్ కేసులు పెట్టించారని గుర్తుచేశారు. ఇంత కంటే దారుణం మరొకటి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులంతా అనేక ఇబ్బందులు పడుతుంటే, కేసీఆర్​పంజాబ్, బిహార్​రైతులకు డబ్బులు ఇవ్వడం ఏంటని? ప్రశ్నించారు. కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. 20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందని, రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికల హామీలను అమలు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడినా ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి ఉన్నదన్నారు.

కానీ కేసీఆర్ తెలంగాణలో అనేక హామీలు ఇచ్చారని, ఒక్కడి కూడా నెరవేరలేదన్నారు. మరోవైపు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ మోసం చేశారన్నారు.పేద ప్రజలపై మోదీకి ప్రేమ లేదన్నారు. బడుగు,బలహీన వర్గాలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీసీలు,ఎస్సీలు, ఎస్టీలు,మైనారిటీలంతా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలన్నారు. గతంలో అనేకమంది పిల్లలు ఐఐటీ,ఐ.ఐ.ఎం చదవడానికి కాంగ్రెస్ కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని ఉదయ్ పూర్ డిక్లరేషన్‌లో చెప్పారన్నారు. రాష్ట్రంలో ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుందని వీహెచ్​తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed