రాహుల్ గాంధీ అమూల్ బేబీ లాంటోడు: NVSS ప్రభాకర్

by GSrikanth |   ( Updated:2024-04-04 16:50:13.0  )
రాహుల్ గాంధీ అమూల్ బేబీ లాంటోడు: NVSS ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమూల్ బేబీగా చిలిపి చేష్టలు చేస్తున్న రాహుల్ గాంధీ దేశానికి గ్యారెంటీ అవుతాడా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇవ్వడానికి తుక్కుగూడకు వస్తున్న సందర్భంగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుక్కుగూడలో రాహుల్ గ్యారెంటీ ఇవ్వడం కాదు.. తెలంగాణలో కాంగ్రెస్‌ను తుక్కు తుక్కుగా ప్రజలు ఓడిస్తారని ఎద్దేవా చేశారు. రాహుల్ హుల్ గాంధీ దేనికి గ్యారెంటీ అని నిలదీశారు. వచ్చే ఎన్నికలకు ప్రత్యేకత ఉందని, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత ప్రజలు విజ్ఞతతో తీర్పు ఇస్తూ వస్తున్నారన్నారు.

వచ్చే 18వ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారని, ప్రజలు ఇప్పటికే తీర్మానం చేసుకున్నారని చెప్పారు. మోడీ అధికారాన్ని అడ్డుకోవాలని కొన్ని వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. సుస్థిర, మచ్చలేని, అవినీతి లేని నాయకుడు మోడీ అని అభివర్ణించారు. మోడీనే దేశానికి అతిపెద్ద గ్యారెంటన్నారు. వారసత్వ, అవినీతికి గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. దేశ విచ్ఛిన్నం కోరుకునే శక్తులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. సంక్షేమం, మెకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాకు మోడీ గ్యారెంటీగా ఉన్నారని స్పష్టం చేశారు. 370 సీట్లు సొంతంగా బీజేపీ కైవసం చేసుకుంటుందని చర్చ జరుగుతోందని అన్నారు.

Advertisement

Next Story